ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పనికిరాని వస్తువులే ఆ రెస్టారెంట్​లో ఫర్నీచర్ - vechiles

గుంటూరులోని ఓ ఫుడ్ కోర్టు నగరవాసుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. అన్ని రకాల రుచులతో పాటు ఫర్నీచర్​ కూడా కొత్త అనుభూతిని అందిస్తోంది. ఆయిల్ డ్రమ్ములు, వాహనాల ముందు భాగాలతో ఏర్పాటు చేసిన ఫర్నీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

రెస్టారెంట్

By

Published : Jul 5, 2019, 6:15 AM IST

వినూత్న రెస్టారెంట్

రోజుకో కొత్త ఆలోచనలతో సరికొత్త రుచులతో హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పాటవుతున్న వేళ... గుంటూరులోని ఓ ఫుడ్ కోర్టు నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించారు. ఆంధ్రా, రాయలసీమ రుచులనే కాదు... ఇండియన్, చైనీస్, మెక్సికన్ రుచుల్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చారు. వినియోగదారుల్ని ఆకర్షించేందుకు వాడిపడేసిన డ్రమ్ములు, పనికి రాని వాహనాల ముందు భాగాల్ని ఫర్నీచర్​గా మార్చేశారు. అలాగే పరిసరాల్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. మారుతున్న నగరవాసుల అభిరుచుల మేరకు... కొత్త ట్రెండ్​కు శ్రీకారం చుట్టారు. ఇపుడు గుంటూరు నగరంలో ఈ రెస్టారెంట్ ఓ హాట్ టాపిక్.

ABOUT THE AUTHOR

...view details