ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్ బాధితులకు అదనంగా 3076 పడకలు' - గుంటూరు కొవిడ్ అప్​డేట్స్

కరోనా పాజిటివ్‌ వ్యక్తుల చికిత్సకు గుంటూరు జిల్లాలో 12 ఆసుపత్రులను సిద్ధం చేసినట్లు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. అదనంగా 3076 పడకలను ఏర్పాటు చేశామన్నారు.

minister sriranganatha raju
మంత్రి శ్రీరంగనాథరాజు

By

Published : Jul 24, 2020, 9:55 AM IST

గుంటూరు జిల్లా రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నందున బాధితులకు వైద్య చికిత్సల కోసం అదనంగా 3076 పడకలను సిద్ధం చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. కరోనా వైరస్‌ నివారణకు తీసుకుంటున్న చర్యలపై జిల్లా అధికారులతో ఆయన ఫోన్‌లో మాట్లాడి పలు సూచనలు చేశారు.

జిల్లాలో 12 ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ బాధితుల చికిత్సకు అనుమతించామని.. త్వరలో ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలను కూడా చికిత్సకు ఉపయోగపడేలా మార్చనున్నట్లు పేర్కొన్నారు. తెనాలి ఏరియా ఆసుపత్రిని కోవిడ్‌ 19 కేంద్రంగా మార్చుతున్నామన్నారు. కరోనా సోకకుండా ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details