Amaravati farmers struggle: రాజధాని రైతుల పోరాటం 1047వ రోజుకు చేరింది. అమరావతి పరిధిలోని గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రైతుల పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చిన నేపథ్యంలో దీక్షా శిబిరాల్లో ఎక్కువ మంది రైతులు కనిపిస్తున్నారు. జై అమరావతి నినాదాలతో శిబిరాలు మారుమ్రోగుతున్నాయి. ప్రభుత్వం... వారిపై విధించిన ఆంక్షలను, అమరావతిపై చేస్తున్న ప్రచారాన్ని రైతులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
Amaravati farmers struggle: 1047వ రోజుకు అమరావతి రైతుల పోరాటం
Amaravati farmers struggle: అమరావతి రైతుల పోరాటం 1047వ రోజుకు చేరింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం తాము భూములు ఇస్తే ఇప్పుడు తమకు భవిష్యత్తు లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఆర్డీఏ చట్టంలో మార్పులు చేయటం, రైతుల పాదయాత్రను అడ్డుకోవటం, రైతులపై కేసులు పెట్టడం వంటి చర్యలు ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం తాము భూములు ఇస్తే ఇప్పుడు తమకు భవిష్యత్తు లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిపై కులంముద్ర వేయటంపై కృష్ణాయపాలేనికి చెందిన 75ఏళ్ల వృద్ధురాలు ఆగ్రహం వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ వాస్తవాలు చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సీఆర్డీఏ చట్టంలో మార్పులు చేయటం, రైతుల పాదయాత్రను అడ్డుకోవటం, రైతులపై కేసులు పెట్టడం వంటి చర్యలు ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పటి వరకూ తమ ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: