ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోజాను అడ్డుకున్న రాజధాని రైతులు - roja ;latest news

గుంటూరు జిల్లా నీరుకొండలో వైకాపా ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజాను అమరావతి రైతులు అడ్డుకున్నారు. ఎస్​ఆర్​ఎం వర్సిటీలో ఓ కార్యక్రమానికి హాజరైన రోజా.. తిరిగి వెళ్తుండగా కారుకు అడ్డు తగిలారు.

రోజాను అడ్డుకున్న రాజధాని రైతులు
రోజాను అడ్డుకున్న రాజధాని రైతులు

By

Published : Feb 20, 2020, 12:38 PM IST

Updated : Feb 20, 2020, 1:28 PM IST

ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజాను అమరావతి నిరసనకారులు అడ్డుకున్నారు. నీరుకొండ ఎస్​ఆర్​ఎం వర్సిటీలో పరిశ్రమ - విద్య అంశంపై నిర్వహిస్తున్న సదస్సుకు ఆమె హాజరయ్యారు. విషయం తెలుసుకున్న అమరావతి రైతులు వర్సిటీ బయట రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమె బయటకు రాగానే వాహనాన్ని వెంబడించారు. పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నిరసనకారులు వాహనాన్ని కదలనీయకుండా నినాదాలు చేశారు. పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారుతుండగా.. పోలీసులు ఆమెను వేరే వాహనంలో తరలించారు.

రోజాను అడ్డుకున్న రాజధాని రైతులు
రోజాను అడ్డుకున్న రాజధాని రైతులు
Last Updated : Feb 20, 2020, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details