అమరావతి రైతుల దీక్షలు 173వ రోజుకు చేరుకున్నాయి. అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధానిని నిర్మించాలంటూ అన్నదాతలు డిమాండ్ చేశారు. తుళ్లూరు మండలం రాయపూడి, తుళ్లూరు, దొండపాడు, అనంతవరం, మందడం గ్రామాల్లో రైతులు, మహిళలు ఇంటి వద్దే దీక్షలు చేపట్టారు.
కోవిడ్ -19 నిబంధనలు పాటిస్తూనే తమ ఇళ్ల వద్దే.. ధర్నాలో పాల్గొన్నారు. రైతుల మనోభావాలను ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలన్నారు. రాజధానిపై సత్వర నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కౌలు డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.