ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఏకైక రాజధానిగా అమరావతినే ప్రకటించాలి'

ముడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతిలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని రైతులు చేస్తున్న ఉద్యమం 287వ రోజుకు చేరుకుంది. పలు గ్రామాల్లో రైతులు, మహిళలు వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు.

ఏకైక రాజధానిగా అమరావతినే ప్రకటించాలి
ఏకైక రాజధానిగా అమరావతినే ప్రకటించాలి

By

Published : Sep 29, 2020, 4:15 PM IST

పరిపాలనా వికేంద్రీకరణను నిరసిస్తూ రాజధానిలో రైతులు చేస్తున్న ఆందోళనలు 287వ రోజుకు చేరాయి. మందడం, వెలగపూడి, బోరుపాలెం, అనంతవరంలో ప్లకార్డులతో అన్నదాతలు దీక్షలు కొనసాగించారు. వెంకటపాలెం, ఐనవోలు, నీరుకొండ, పెదపరిమిలో మహిళలు నిరసన తెలిపారు. బేతపూడి, పెనుమాక, ఎర్రబాలెం, లింగాయపాలెంలో వినూత్నంగా గీతా పారాయణం చేశారు.

కృష్ణాయపాలెంలో రహదారిపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తుళ్లూరులో రైతులకు మద్దతుగా చిన్నారులు ఆందోళనలో పాల్గొన్నారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు, మహిళలు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details