జైల్భరోకి వెళ్ళి అరెస్టైన రైతులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తుళ్లూరులో అన్నదాతలు, మహిళలు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో భాగంగా వాణి అనే మహిళ స్పృహ తప్పి పడిపోయింది. పక్కనే ఉన్న మహిళలు స్పందించి ఆమెను శిబిరంలోకి తరలించారు. రైతులను ఇంత క్షోభకు గురి చేసిన సీఎం జగన్ పదవికి రాజీనామా చేయాలని మహిళలు డిమాండ్ చేశారు.
సీఎం జగన్ పదవికి రాజీనామా చేయాలి: అమరావతి మహిళలు - జైల్ భరో కార్యక్రమం అప్ డేట్స్
అమరావతి రైతులను క్షోభ పెడుతున్న సీఎం జగన్ పదవికి రాజీనామా చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. జైల్భరోకి వెళ్ళి అరెస్టైన రైతులను వెంటనే విడుదల చేయాలని తుళ్లూరులో మహిళలు డిమాండ్ చేశారు.
అమరావతి రైతుల నిరసన