అమరావతి రాజధానిపై భాజపా తన వైఖరేంటో తెలపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 52 రోజులుగా రైతులు నిరసన వ్యక్తం చేస్తుంటే భాజపా స్పష్టమైన వైఖరి తెలపకుండా.. నేతలు ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఉద్యమాన్ని ఆపబోమని రైతులు స్పష్టం చేస్తున్నారు.
'రాజధాని అంశంపై భాజపా వైఖరేంటి..?' - భాజపాను ప్రశ్నిస్తున్న అమరావతి రైతులు
52వ రోజూ అమరావతిలో ఆందోళనలు మిన్నంటాయి. మందడంలో రైతులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. రాజధాని అంశంపై భాజపా వైఖరేంటో తెలియజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రాజధాని అంశంపై భాజపా వైఖరేంటి..?'