కరోనా నియంత్రణ దిశగా ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో.. అమరావతి రైతులు ఇళ్ల దగ్గరే దీక్షలు కొనసాగిస్తున్నారు. ఇవాల్టితో వారి పోరాటం 104వ రోజుకు చేరుకుంది. వెంకటపాలెంలో మహిళలు సామాజిక దూరం పాటిస్తూ రహదారిపై నిలుచుని ఆందోళన చేశారు. మందడం, అబ్బురాజుపాలెంలో, నీరుకొండ, నేలపాడులో రైతులు ఇళ్ల వద్ద అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
104వ రోజుకు చేరిన రాజధాని రైతుల దీక్షలు
పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన 104వ రోజుకు చేరింది. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో రైతులు, మహిళలు ఇళ్ల వద్దే ఆందోళన కొనసాగించారు.
104రోజుకు చేరిన రాజధాని రైతులు దీక్షలు