ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరారెడ్డి నగర్ వాసులకు లాటరీ పద్ధతిలో ఇళ్ల కేటాయింపు - గుంటూరు జిల్లా వార్తలు

గుంటూరు జిల్లాలోని బంకింగ్ హామ్ కాలువ పక్కనే ఉంటున్న అమరారెడ్డి నగర్ వాసులకు లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయించారు. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డిలు ర్యాండమ్ పద్ధతిలో లబ్ధిదారులతో లాటరీ తీయించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో లబ్ధిదారులకు అన్ని సదుపాయాలు కల్పించామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Allotment of houses by lottery to the residents of Amarareddy Nagar
అమరారెడ్డి నగర్ వాసులకు లాటరీ పద్ధతిలో ఇళ్ల కేటాయింపు

By

Published : Jun 17, 2021, 9:22 PM IST

ముఖ్యమంత్రి జగన్ నివాస ప్రాంతంలోని బకింగ్ హామ్ కాలువ పక్కనే ఉంటున్న అమరారెడ్డి నగర్ వాసులకు లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయించారు. మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డిలు ర్యాండమ్ పద్ధతిలో లబ్ధిదారులతో లాటరీ తీయించారు.

ముఖ్యమంత్రి భద్రత కోసమే అమరారెడ్డినగర్ వాసులను మంగళగిరి మండలం ఆత్మకూరుకు తరలిస్తున్నామని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో లబ్ధిదారులకు అన్ని సదుపాయాలు కల్పించామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. మొత్తం 283 మంది లబ్ధిదారులకు అన్ని వసతులు అందించిన తర్వాత వాళ్లకు అనుకూల సమయంలో ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చన్నారు.

ఇదీ చదవండి

ప్రభుత్వ ఆధీనంలోకి బ్రాహ్మణ కార్పొరేషన్​ భూమి

ABOUT THE AUTHOR

...view details