ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నీ మూసేసినా...మిర్చియార్డు కార్యకలాపాలు యథాతథం! - guntur mirchi yard

జనతా కర్ఫ్యూ పిలుపుతో అన్ని వ్యవస్థలు బంద్‌ అయ్యాయి. సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు.. ఇలా అన్నింటినీ మూసివేశారు. కొన్నిచోట్ల వివాహాలు, విందులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. అయితే కర్ఫ్యూ నాడు గుంటూరు మిర్చి యార్డు కార్యకలాపాలు మాత్రం యథావిధిగా సాగుతున్నాయి. వేలాది మంది రైతులు, కూలీలు సంచరించే యార్డును మూసివేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గుంటూరు మిర్చియార్డు
గుంటూరు మిర్చియార్డు

By

Published : Mar 22, 2020, 5:06 AM IST

Updated : Mar 22, 2020, 11:42 AM IST

ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్‌ యార్డుగా పేరున్న గుంటూరు మిర్చి యార్డుకు... రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రైతులు వస్తుంటారు. అలాగే వేలాది మంది కూలీలు ఇక్కడ పనిచేస్తుంటారు. మార్కెట్‌ యార్డు అధికారులు, ఉద్యోగులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, స్టాకిస్టులు ఇలా నిత్యం 5 వేల మంది వరకూ మార్కెట్‌లో ఉంటారు. ఇంత రద్దీగా ఉండే మిర్చియార్డు... జనతా కర్ఫ్యూ నేపథ్యంలోనూ తెరిచి ఉంటుందని ప్రభుత్వం, యార్డు యాజమాన్యం తెలిపింది. దేశమంతా స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాల్సిన వేళ.... గుంటూరు మిర్చి యార్డులో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే మిర్చియార్డును మూసివేయాలి. రైతులు పంట విక్రయించుకునేందుకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే... మార్కెట్‌ యార్డులను తెరిచే ఉంచుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ మిర్చియార్డులో పరిస్థితి మిగతా మార్కెట్ల కంటే భిన్నంగా ఉంటుంది. మామూలు రోజుల్లోనే మిరప ఘాటుకు తుమ్ములు, దగ్గు వస్తుంటాయి. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో... ఏ ఒక్క వైరస్‌ బాధితుడు ఇక్కడికి వచ్చినా మిగతా వారికి ఇట్టే అంటుకునే ప్రమాదం ఉంది. అందువల్ల మరింత అప్రమత్తత అవసరం. ఇంతటి తీవ్రమైన పరిస్థితుల్లో మిర్చియార్డును 15 రోజుల పాటు మూసేయడం వల్ల కలిగే నష్టం ఏంటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.

మార్కెట్‌యార్డు పూర్తిగా మూసివేస్తే.... రైతులు ఇబ్బంది పడతారన్నది ప్రభుత్వం, యంత్రాంగం చెబుతున్న మాట. కరోనా ప్రభావంతో ఇప్పటికే మిర్చి ధర పడిపోయిందని... మార్కెట్‌ మూసేస్తే దళారుల మోసాలు పెచ్చరిల్లే అవకాశం ఉందని అంటున్నారు. అన్ని సౌకర్యాలు, పారిశుద్ధ్య చర్యలు చేపట్టి...మార్కెట్‌లో కొనుగోళ్లు కొనసాగిస్తామని యార్డు ఛైర్మన్‌ ఏసురత్నం తెలిపారు. పంట అమ్మే పరిస్థితి లేదనుకుంటే.... శీతల గిడ్డంగుల్లో సరకు నిల్వ చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు.

కరోనా కారణంగా ఇప్పటికే చైనాతో పాటు ఇత దేశాలకు మిర్చి ఎగుమతులు నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాలూ సరిహద్దులు మూసివేయడంతో ధరలు పడిపోయాయి. ఈ సమయంలో మిర్చి కొనేది స్థానిక వ్యాపారులు మాత్రమేనని రైతులు అంటున్నారు. మార్కెట్‌ యార్డు తెరిచి ఉంచితే... వాళ్లు కూడా ధరల్ని మరింత తగ్గించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. గోదాముల్లో సరకు దాచుకునే వెసులుబాటు కలిగించాలని కోరుతున్నారు.

మిర్చియార్డు కార్యకలాపాలు యాథాతథం

ఇదీచదవండి

కరోనా కట్టడికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు

Last Updated : Mar 22, 2020, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details