ఈ సెట్ ఫలితాల్లో గుంటూరు జిల్లా మాచర్ల మండలం అచ్చమ్మ కుంట తండాకు చెందిన రామవత్ ఏలీయా నాయక్ అగ్రికల్చర్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు పొందాడు. తల్లిదండ్రులు చిన బాలు, మంగతి వ్యవసాయ పనులు చేస్తుంటారు.
ఈసెట్లో మెరిసిన అచ్చమ్మ కుంట తండా కుర్రాడు
జిల్లాలోనే మారుమూల ప్రాంతం ఆ తండా. ప్రాథమిక విద్య దాటితే చదువు కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లాలి. చదువుపై మక్కువతో వెళ్దామంటే వాహన సౌకర్యమూ అంతంత మాత్రమే. అలాంటిది ఓ మారుమూలలోని అచ్చమ్మ కుంట తండా చెందిన రామవత్ ఏలీయా నాయక్.. ఈ సెట్ అగ్రి కల్చర్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించాడు.
ఈసెట్లో మెరిసిన అచ్చమ్మ కుంట తండా కుర్రాడు
తాను రోజుకు 14 గంటలు కష్టపడి చదువుతాననని ఏలీయానాయక్ చెప్పారు. పదవ తరగతి సాగర్ పిటీజీ పాఠశాల, అగ్రికల్చర్ డిప్లొమా చిత్తూరు జిల్లా కలిగిరిలో చేసినట్లు చెప్పారు. అగ్రికల్చర్ ప్రొఫెసర్ కావలన్నదే తన లక్ష్యమని అన్నాడు. తన కల సాకారం దిశగా అడుగులు వేస్తున్నాడు ఆ కుర్రాడు.