ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Alapati:'రెండు నెలల్లో ఆరు సార్లు దాడి..అతనిపై రౌడీషీట్ తెరవాలి' - ఆలపాటి రాజా న్యూస్

గుంటూరు జిల్లా ఉంగుటూరు గ్రామ సర్పంచ్ భర్త సోమశేఖర్​పై దాడికి పాల్పడిన రాయపాటి శివపై రౌడీషీట్ తెరిచి తక్షణమే అరెస్టు చేయాలని మాజీ మంత్రి ఆలపాటి రాజా డిమాండ్ చేశారు. గత రెండు నెలల్లో ఆరు సార్లు సోమశేఖర్​పై దాడి జరిగినా..పోలీసులెందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు.

Alapati Raja comments On Vunguturu attack issue
రెండు నెలల్లో ఆరు సార్లు దాడి..అతనిపై రౌడీషీట్ తెరవాలి

By

Published : Jun 15, 2021, 3:38 PM IST

అధికార అహంతో విచ్చలవిడిగా ప్రవర్తించటం వైకాపా నేతలకు సరికాదని మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. గుంటూరు జిల్లా ఉంగుటూరు గ్రామ సర్పంచ్ భర్త సోమశేఖర్​పై దాడికి పాల్పడిన రాయపాటి శివపై రౌడీషీట్ తెరిచి తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గత రెండు నెలల్లో ఆరు సార్లు సోమశేఖర్​పై దాడి జరిగినా..పోలీసులెందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా చేసే వారిని ఆపటం సిగ్గుచేటని మండిపడ్డారు. హోంమంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి దాడులు జరుగుతున్నా పట్టించుకోకపోవటం హేయమైన చర్యని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details