అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట - guntur
న్యాయం కోసం ఎదురుచూస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించింది.ఉమ్మడి హైకోర్టు ఆదేశాలతో చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది.
guntur
ఉమ్మడి హైకోర్టు ఆదేశాలను అనుసరించి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమైంది. గుంటూరులో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అధికారులు రశీదులను పరిశీలించారు. 10వేల రూపాయల లోపు చెల్లింపుల కొరకు ప్రభుత్వం ఇదివరకే రూ. 250కోట్లు నిధులు కేటాయించింది. దరఖాస్తు దార్లు తెచ్చిన డిపాజిట్ బాండ్లతో సహా అన్ని పత్రాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ ప్రక్రియ తర్వాత కలెక్టర్ ద్వారా డిపాజిట్దార్ల బ్యాంకు ఖాతాల్లోనగదుజమ చేయనున్నారు.