ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నదిపై రెండు బ్యారేజీల నిర్మాణానికి గత సెప్టెంబర్‌లో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. వరదల సమయంలో సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటికి అడ్డుకట్ట వేయటంతో పాటు డెల్టా భూములు ఉప్పు బారకుండా పరిరక్షించేందుకు ఈ ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. ప్రకాశం బ్యారేజీకి 12 కిలోమీటర్ల దిగువన ఒకటి, 62 కిలోమీటర్ల దిగువన మరొక బ్యారేజీ రానుంది. రెండున్నర వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టుల వల్ల సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. బ్యారేజీల వల్ల పర్యావరణం ఏమేరకు ప్రభావితమవుతుందనే అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని నాగార్జున వర్సిటీ నిపుణుల బృందాన్ని కోరింది. ఎన్జీటీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా ఉండాలంటే ఈ నివేదిక కీలకం కానుంది.
కృష్ణా నదిపై రెండు కొత్త బ్యారేజీలు... ఆచార్య నాగార్జున వర్సిటీకి అధ్యయన బాధ్యతలు - prakasam barrage news
కృష్ణానదిపై నిర్మించబోయే రెండు కొత్త బ్యారేజీలకు సంబంధించి పర్యావరణ ప్రభావిత అంశాలపై ఆచార్య నాగార్జున వర్సిటీ అధ్యయనం చేయనుంది. వర్సిటీ పర్యావరణ విభాగానికి రాష్ట్ర జలవనరులశాఖ నుంచి వచ్చిన లేఖ మేరకు ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. బ్యారేజీల నిర్మాణం వల్ల భవిష్యత్తులో పర్యావరణ మార్పులు, సామాజిక అంశాలు, జీవజాతులు, ప్రజలపై ప్రభావాన్ని కమిటీ అధ్యయనం చేయనుంది.
కృష్ణా నదిపై రెండు కొత్త బ్యారేజీలు
ఆచార్య నాగార్జున వర్సిటీ పర్యావరణ విభాగాధిపతి స్వామి నేతృత్వంలోని బృందం.. త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. బ్యారేజీల వల్ల కలిగే అనుకూల, వ్యతిరేక అంశాలను వీరు అధ్యయనం చేస్తారు. బ్యారేజీల్లో నీటినిల్వ వల్ల.. భూగర్భ జలాలు ఉప్పుమయమయ్యే సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్సిటీ నిపుణులు, జలవనరులశాఖ, ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి 3 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక రూపొందిస్తారు.
ఇదీ చదవండి