రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామం వద్దనున్న అన్నవరం మేజర్ కాలువ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరుకు చెందిన ఆర్మీ అధికారి కర్నల్ రామ రఘునందన్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు. చెన్నైలో తమ బంధువుల ఇంట్లో జరిగే వివాహానికి కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయలుదేరారు.
సంతగుడిపాడు గ్రామం వద్దనున్న అన్నవరం మేజర్ కాలువ వద్ద అదుపుతప్పిన కారు.. అటుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి... మేజర్ కాలువలోకి దూసుకుపోయింది. కారులో బెలూన్స్ ఓపెన్ అవ్వడం వల్ల క్షతగాత్రులకు ప్రాణాపాయ పరిస్థితి తప్పిందని ఎస్సై హాజరత్తయ్య తెలిపారు. క్షతగాత్రులను 108లో నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.