Man Drinks Acid: చాలా మంది దాహం వేసినప్పుడు నీటి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ క్రమంలో ఎదైనా నీరు ఉన్న బాటిల్ కనిపించగానే మూత తీసేసి దాహాన్ని తీర్చుకుంటారు. కానీ కొన్ని సమయాల్లో అందులో తాగే నీరు కాకుండా ఏమైనా హానికారక ద్రవాలు ఉండవచ్చు. ఇలాగే ఓ వ్యక్తి దాహంగా ఉందని.. మంచినీళ్లనుకొని పొరపాటున యాసిడ్ తాగాడు. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లాలో చోటు చేసుకుంది.
మంచినీళ్లు అనుకుని తాగాడు.. ఆ తర్వాత ఏమైందంటే - a man Drunk Acid at Warangal Rural District
Man Drinks Acid: పాత సీసాలు సేకరించి అమ్ముకునే వ్యక్తికి ఓ సీసా దొరికింది. అప్పటికే అతనికి దాహం వేసిందేమో.. ఆ బాటిల్లోని నీటిని తాగాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేంటో తెలుసా..
మంచినీళ్లు అనుకుని తాగాడు
వర్ధన్నపేట పట్టణంలోని వంశరాజ్ కాలనీకి చెందిన సాయిలు పాత సీసాలు సేకరించి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పాత బాటిల్స్ సేకరిస్తూ ఉండగా ఓ సీసా అతని కంటపడింది. అందులో ఉన్న నీటిని చూసి.. మంచినీళ్లు అనుకొని తాగాడు. కానీ అందులో ఉన్నది యాసిడ్ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో బాధితుడిని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: