ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిలకలూరిపేటలో కరోనా కలకలం... ఓ వ్యక్తికి వైద్య పరీక్షలు..! - కరోనా వైరస్ వార్తలు

ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోంది కరోనా వైరస్. చైనాలో జీవం పోసుకున్న ఈ ప్రాణాంతక వైరస్... వివిధ దేశాలకు వ్యాపించింది. ఈ నేపథ్యంలో వైరస్ సోకిందేమోనన్న అనుమానంతో చిలుకలూరిపేటలో ఓ వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

carona virus
carona virus

By

Published : Jan 28, 2020, 11:53 PM IST

నాదెళ్ల వెంకటసుబ్బయ్యతో వైద్యాధికారి గోపీనాయక్

కరోనా వైరస్​ అలజడి నేపథ్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఓ వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అతను ఇటీవలే చైనా పర్యటనకు వెళ్లి వచ్చారు. అధికారులు ముందు జాగ్రత్తగా ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. చిలకలూరిపేటకు చెందిన నాదెళ్ల వెంకటసుబ్బయ్య, తన మిత్రులు సురేష్​కుమార్(విజయవాడ), గోపాలకృష్ణ, వాసుదేవరావు (గుంటూరు), నరేంద్ర (హైదరాబాద్)లతో కలసి ఈ నెల 9వ తేదీన చైనాకు విహారయాత్రకు వెళ్లారు.

ఆ దేశంలోని నాన్​ట్యాంగ్​లో వీరందరూ... మరో మిత్రుడు శ్రీధర్​రెడ్డిని కలిశారు. అతని సహకారంతో చైనాలోని బీజింగ్, షాంగై, నాన్​ట్యాంగ్, మిచాంగ్ నగరాల్లోని పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. అనంతరం ఈ నెల 19న భారత్​కు చేరుకున్నారు. ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తున్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిలకలూరిపేటలో ఉన్న వెంకట సుబ్బయ్యను వైద్యాధికారి గోపీనాయక్ మంగళవారం ఆయన ఇంటికి వెళ్లి విచారించారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. వెంకటసుబ్బయ్యకు వ్యాధి లక్షణాలు లేకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు.

ఇదీ చదవండి:'కరోనా'​కు మందు కనుగొన్న తమిళ వైద్యుడు!

ABOUT THE AUTHOR

...view details