గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలంలోని పాశర్లపాడు గ్రామంలో మొసలి కలకలం రేగింది. గ్రామంలోని పిల్లివాగులో చేపలు పడుతున్న సమయంలో వలకు మొసలి చిక్కింది. భయాందోళన గురైన స్థానికులు... మొసలిని కొట్టి చంపారు.
వాగులో మరో రెండు మొసళ్లు తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. దీంతో వాగు వద్దకు వెళ్లేందుకు స్థానికులు భయపడుతున్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. అధికారులు స్పందించి మొసళ్లను పట్టుకెళ్లాలని కోరుతున్నారు.