ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా పాలనలో ముస్లింలపై దాడులు పెరిగాయి: ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముస్లింలపై దాడులు పెరిగాయని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. అబ్దుల్ సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని కోరుతూ... కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.

candlelight rally was held at the local Island Center
వైకాపా అధికారంలో ముస్లింలపై దాడులు పెరిగాయి

By

Published : Nov 11, 2020, 12:21 PM IST

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముస్లింలపై దాడులు పెరిగాయిని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. ఇందుకు నంద్యాలలో జరిగిన ఘటనే నిదర్శనం అన్నారు. ఈ దాడులను వ్యతిరేకిస్తూ... మంగళవారం గుంటూరులోని స్థానిక ఐల్యాండ్ సెంటర్​లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.

సామాన్యులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే కేసులు పెట్టి వారి ప్రాణాలను బలి కోరటం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి వారి ఆత్మహత్యకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details