గుంటూరు బాలాజీనగర్కి చెందిన బాలిక పై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. బాలాజీనగర్లో నివసిస్తున్న దంపతులకు ముగ్గురు సంతానం. ఇంటి పక్కనే ఉంటున్న ఉదయగిరి సిద్ధాంతి అనే వృద్ధుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో 8 ఏళ్ల బాలికపైన అత్యాచారానికి యత్నించాడు. ఈ నేపధ్యంలో ప్రతిఘటించిన బాలిక కేకలు వేసింది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం - latest crime news of guntur
'దిశ' లాంటి చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చినా కామాంధుల్లో భయం పెరగడం లేదు. రోజు రోజుకి అత్యాచారాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గుంటూరు జిల్లాలో 70ఏళ్ల వృద్ధుడు ఓ బాలికపై అత్యాచారానికి యత్నించడం కలకలంరేపుతోంది.
మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచారయత్నం