గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 200 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక నిఘాతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. ఈ బియ్యాన్ని సీజ్ చేశారు. అక్రమార్కులపై పోలీసులు కేసుల నమోదు చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అక్రమంగా నిల్వ ఉంచిన 200 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత - గుంటూరు జిల్లాలో రేషన్ బియ్యం పట్టివేత
రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు అధికారులు, పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా.. అక్రమార్కులు యధేచ్చగా తమ పని కానిస్తున్నారు. పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యం... అక్రమార్కుల జేబులు నింపుతోంది. గుంటూరు జిల్లా బోయపాలెంలో అక్రమంగా నిల్వ ఉంచిన 200 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా నిల్వ ఉంచిన 200 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత