ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOP NEWS : ఏపీ ప్రధాన వార్తలు @ 1 PM - తెలుగు ప్రధాన వార్తలు

.

ఏపీ ప్రధాన వార్తలు
TOP NEWS

By

Published : Nov 10, 2022, 12:59 PM IST

  • పరిశ్రమలకు విద్యుత్‌ సుంకం బాదుడు.. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోనే అధికం
    కొవిడ్‌తో సవాళ్లను ఎదుర్కొంటున్న పారిశ్రామిక రంగంపై.. ప్రభుత్వం విద్యుత్‌ సుంకం బాదుడు వేసింది. ఆదుకోవాల్సిన సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లోనే అధికంగా సెస్‌ విధించి.. ఏటా 2వేల 600కోట్ల భారాన్ని మోపింది. గడిచిన నాలుగు నెలల్లోనే 867 కోట్లు రాబట్టింది.
    పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి పాత్ర బయటపడింది: పంచుమర్తి అనురాధ
    దిల్లీ మద్యం కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో విజయసాయిరెడ్డి పాత్ర బయటపడిందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. అరబిందో ఫార్మాలో కీలక డైరెక్టర్​ శరత్ చంద్రారెడ్డి అరెస్టు పట్ల వైకాపా నేతలు ఇప్పుడేం మాట్లాడతారని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలో తయారయ్యే కల్తీ మద్యం తాగి ఎందరో ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
    పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • State sports authority: త్వరలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి క్రీడా మైదానాలు
    పేద, మధ్యతరగతి క్రీడాకారులు సాధన చేసేందుకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న క్రీడా మైదానాలు త్వరలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని ఇండోర్ స్టేడియాల్లోని 66 కోర్టులు లీజుకు ఇవ్వబోతున్నారు. ప్లే అండ్ పే విధానం వచ్చాక ఇప్పటికే పలువురు పేద, మధ్య తరగతి క్రీడాకారులు సాధనకు దూరమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కోడి గుడ్లు కాకులు ఎత్తుకుపోయాయంట..! ఎక్కడో తెలుసా..?
    నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్నం భోజన నాణ్యతను పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేకు భోజన కార్మికురాలు చెప్పిన సమాధానం విని ఖంగుతున్నారు. 150 మంది విద్యార్థులుంటే 115 గుడ్లే ఉడకబెట్టడం ఎమిటని, మిగతా 35 గుడ్లు ఏమయ్యాయని అడిగితే కాకులు ఎత్తుకుపోయాయాని సమాధానం చెప్పింది.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మరో నిర్భయ తరహా దారుణం.. జననాంగాల్లో పైపు చొప్పించి హత్యాచారం
    ఓ మహిళను అత్యాచారం చేశారు కొందరు దుండగులు. అనంతరం ఆమె జననాంగాల్లోకి పైపును చొప్పించారు. ఆ తర్వాత చంపేశారు. ఈ ఘటన హరియాణాలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎన్​ఐఏ భారీ ఆపరేషన్.. ఒకేసారి 45 చోట్ల సోదాలు.. టార్గెట్​ వారే!
    కోయంబత్తూరు కారు పేలుడు ఘటనలో జాతీయ దర్యూప్తు సంస్థ భారీ ఆపరేషన్​ చేపట్టింది. తమిళనాడువ్యాప్తంగా సోదాలు నిర్వహించింది.
    పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బ్రిటన్​ రాజుకు చేదు అనుభవం.. చార్లెస్​ దంపతులపై గుడ్లు విసిరిన నిరసనకారుడు
    ఉత్తర ఇంగ్లాండ్‌లో పర్యటించిన బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. రాజు కుటుంబానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఓ నిరసనకారుడు వారిపై గుడ్లను విసరడం కలకలం రేపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • క్రెడిట్‌ కార్డ్ క్యాన్సిల్‌ చేయాలా? ఈ తప్పులు చేయొద్దు!
    క్రెడిట్ కార్డు క్యాన్సిల్ చేసుకోవాలి అనుకునే వారు తప్పనిసరిగా కార్డు మూసివేత అభ్యర్థనను చేసుకోవచ్చు. అయితే ఈ తప్పులు మాత్రం చెయ్యొద్దు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మార్పులతో బరిలోకి భారత్​.. కానీ పోరుకు వర్షం ముప్పు!
    టీ20 వరల్డ్‌కప్‌ 2022లో భాగంగా టీమ్​ఇండియా-ఇంగ్లాండ్​ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్​కు వర్షం ముప్పు ఉందని తెలుస్తోంది. ఒకవేళ వర్షం పడకుండా యథావిధిగా మ్యాచ్ కొనసాగితే టీమ్​ఇండియా కొన్ని మార్పులతో బరిలో దిగనుందని తెలిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అర్జున్​ కపూర్​తో పెళ్లిపై ఒక్క పోస్ట్​తో క్లారిటీ ఇచ్చేసిన మలైకా అరోరా
    బాలీవుడ్‌ సెలబ్రిటీలు అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా ప్రేమాయణం బీటౌన్‌లో నిత్యం చర్చనీయాంశమే. ఎందుకంటే మలైకా కంటే అర్జున్‌కపూర్‌ వయసులో 12 ఏళ్లు చిన్నవాడు. అయినా.. వీరిద్దరు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే చాలా కాలంగా రిలేషన్​షిప్​లో ఉన్న ఈ జంట పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారో ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details