గుంటూరు జిల్లా నరసరావుపేటలో రవాణా శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నరసరావుపేట చుట్టుపక్కల సరైన అనుమతి పత్రాలు లేని ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలకు చెందిన 14 బస్సులను సీజ్ చేసినట్లు ఎంవీఐ అనిల్ కుమార్ తెలిపారు. పాఠశాలల బస్సులకు కచ్చితంగా అన్ని అనుమతులూ ఉండాలని సూచించారు. డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని చెప్పారు. రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తే ప్రమాదాలను నివారించొచ్చని తెలిపారు.
పాఠశాలలపై కొరడా... 14 బస్సులు సీజ్ - 14 buses
గుంటూరు జిల్లా నరసరావుపేటలో రవాణా శాఖ అధికారులు 14 పాఠశాల బస్సులను సీజ్ చేశారు.
నరసరావుపేటలో 14 పాఠశాల బస్సుల సీజ్