గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో తల్లిదండ్రులు మందలించారని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామంలో కలవర పెట్టింది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు... ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు రోజంతా టీవీ చూడటం, ఫోన్లో వీడియో గేమ్‌లు ఆడటం చేస్తున్నాడని చెప్పారు. నిద్రాహారాలు మాని ఆ బాలుడు ఇదే పనిలో ఉండటంతో తల్లిదండ్రులు మందలించి పొలం పనులకు వెళ్లారు. రాత్రి ఇంటికి వచ్చే సరికి బాలుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
టీవీ చూడొద్దన్నందుకు 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్య - 12 yeas boy suicide in guntur district latest news
పిల్లలను తల్లిదండ్రులు మందలించడం సహజమే. ఓ బాలుడిని తల్లిదండ్రులు టీవీ చూడొద్దు అన్నందుకు వట్టిచెరుకూరులోని ఓ బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తల్లిదండ్రులు మందలించినందుకు బాలుడు ఆత్మహత్య