ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సూపర్ స్టార్ దత్తత గ్రామంలో 100 శాతం వాక్సినేషన్ పూర్తి!

సూపర్​స్టార్ ​మహేష్ బాబు దత్తత గ్రామంలో వందశాతం వాక్సినేషన్ పూర్తయినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈనెల 10 నుంచి నేటి వరకు కొనసాగిన రెండో దశ టీకా పంపిణీ ప్రక్రియ విజయవంతగా ముగిసిందని వివరించారు.

100 percent of vaccination
సూపర్ స్టార్ దత్తత గ్రామం

By

Published : Jul 12, 2021, 7:59 PM IST

Updated : Jul 12, 2021, 9:02 PM IST

సూపర్​స్టార్ ​మహేష్ బాబు దత్తత గ్రామం గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో కొవిడ్ వాక్సినేషన్ వందశాతం పూర్తయిందని అధికారులు తెలిపారు. 'మహేశ్ బాబు ఫౌండేషన్​' ద్వారా మే 31న మహేశ్​బాబు తండ్రి సూపర్​స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభమైన మొదటి దశ వాక్సిన్ పంపిణీ.. నేటితో విజయవంతంగా ముగిసినట్లు వెల్లడించారు. ఆంధ్ర ఆసుపత్రి పర్యవేక్షణలో రెండో దశ ప్రక్రియ ఈనెల నిన్నటి నుంచి ఈ రోజు వరకు కొనసాగింది. రెండు రోజులపాటు కార్యక్రమం సజావుగా సాగిందని నిర్వాహకులు పెమ్మసాని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

కొవిడ్ విపత్కర పరిస్థితుల నుంచి తమ గ్రామస్థులను కాపాడుకునేందుకు ఫౌండేషన్ ద్వారా వ్యాక్సిన్​ను ఉచితంగా పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. మొదటి దశలో 1250 మందికి వేశామని ఆంధ్ర ఆసుపత్రి డాక్టర్ ఆనంద్ వెల్లడించారు. తాజాగా రెండో దశలో కూడా అందరికీ టీకా వేసినట్లు వివరించారు. టీకా తీసుకున్నవారిలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు వెలుగుచూడలేదని .. ప్రస్తుతం అందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్వాహకులు చెప్పారు.

దత్తత గ్రామంపై మమకారంతో మహేష్ బాబు టీకాలు పంపిణీ చేసినందుకు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి అయ్యాయని.. రాబోయే కాలంలో కూడా గ్రామానికి 'మహేష్ బాబు పౌండేషన్' అండగా ఉండాలని గ్రామస్థులు కోరారు.

Last Updated : Jul 12, 2021, 9:02 PM IST

ABOUT THE AUTHOR

...view details