ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సంక్షేమ పండుగకు' సర్వం సిద్ధం - cm chandrababu

రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పండుగ నిర్వహణకు  ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వివిధ పథకాల ద్వారా లబ్దిదారులకు ఆర్థిక ప్రయోజనాన్ని ఆయా నియోజకవర్గాల్లోని  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పంపిణీ చేయనున్నారు.

cm

By

Published : Feb 2, 2019, 6:52 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పండుగ నిర్వహణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వివిధ పథకాల ద్వారా లబ్దిదారులకు ఆర్థిక ప్రయోజనాన్ని ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పంపిణీ చేయనున్నారు. దాదాపు 54లక్షల మందికి పింఛన్‌తో పాటు మరో 95లక్షల మందికి పసుపు-కుంకుమ కింద 10వేల రూపాయల చెక్కులను అందచేయనున్నారు .కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరిపల్లిలో నిర్వహించే పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు.

cm

ప్రభుత్వం పెంచిన పింఛన్లను పండుగ వాతావరణంలో ఈ మూడు రోజులు పంపిణీ చేసేందుకు జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లు చేశారు. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్‌ను 2000రూపాయలు అందజేయనున్నారు. 80 శాతం పైగా అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు, ట్రాన్స్ జెండర్లకు 3000 రూపాయలు అందనుంది. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రభుత్వ, నెట్ వర్క్ ఆస్పత్రులలో డయాలసిస్ తీసుకుంటున్న వారికి 3500రూపాయలు పింఛను కింద ఇస్తారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద మరో 3.55 లక్షల మందికి సౌకర్యం కల్పిస్తూ జనవరి 28న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల పింఛన్లకు పెంచిన మొత్తాన్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
పసుపు-కుంకుమ పథకం ద్వారా ప్రతి డ్వాక్రా పొదుపు సంఘ సభ్యురాలికి మూడు విడతలుగా 10 వేల రూపాయల మొత్తాన్ని చెక్కుల రూపంలో అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలి విడత ఫిబ్రవరి 2న 2500రూపాయలు, రెండో విడత మార్చి 8న 3500రూపాయలు, ఏప్రిల్ 5న మూడవ విడతగా 4000 రూపాయలను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details