Young man was kidnapped: ఏలూరులో గత రాత్రి ఓ యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఈ ఘటన నిన్న రాత్రి జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గత రాత్రి పది గంటల సమయంలో ఒక వ్యక్తిని కారులో కొందరు వ్యక్తులు బలవంతంగా కిడ్నాప్ చేశారనే సమాచారంపై జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు, టూ టౌన్ సీఐ చంద్రశేఖర్ ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి వద్ద సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించి.. దాని ద్వారా కిడ్నాప్ ఛేదించారు.. 12 గంటల వ్యవధిలో ఛేదించి కిడ్నాప్‌కు కారణమైన మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
- ALSO READ:విద్యార్థినిని కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్.. పెట్రోల్ పోసి నిప్పు.. 2నెలలుగా చికిత్స పొందుతూ..
మహిళతో పరిచయమే కారణం..చేబ్రోలు రైల్వే స్టేషన్ మాస్టర్ పుట్టి చంద్రశేఖర్ అనే వ్యక్తి తన భార్య చనిపోవడంతో.. రెండు సంవత్సరాల క్రితం అప్పటికే పెళ్లి అయ్యి భర్త చనిపోయి ఉన్న పంచకర్ల గ్రీష్మ అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె ప్రస్తుతుం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తోంది. ఆమెతో కూడా విభేదాలు రావడంతో కొంతకాలంగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. నిన్న రాత్రి ఆమెతో మాట్లాడేందుకు చంద్రశేఖర్ ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. అయితే ఆమెతో మాట్లాడటానికి వచ్చిన చంద్రశేఖర్‌ను మాదేపల్లికి చెందిన బాలి బోయిన నవహర్ష అనే వ్యక్తి మరో ఆరుగురు వ్యక్తులతో కలిసి తన ఏపీ 39 ఏహెచ్ 2222 నెంబర్ గల జీపులో బలవంతంగా ఎక్కించుకుని పోణింగి వైపు తీసుకెళ్లారు.