Suicide of Love Married Youth: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు.. వివాహమై మూడు నెలలు కాకముందే కాపురంలో వచ్చిన చిన్న చిన్న మనస్పర్థలు పరిష్కరించుకోలేక పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. అక్కడ కూడా పరిష్కారం కాకపోవడంతో ఆ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొని అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఈ విషాద సంఘటన ఏలూరు (Eluru) జిల్లాలో చోటు చేసుకుంది. దెందులూరు గ్రామానికి చెందినచుక్క తేజ్ మూర్తి, ఏలూరుకు చెందిన ప్రియాంక..వీళ్లిద్దరూ గత ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవటంతో మూడు నెలల క్రితం వారిని ఎదిరించి వివాహం చేసుకున్నారు.
తల్లిదండ్రులు అంగీకరిస్తేనే ప్రేమ వివాహం.. గుజరాత్లో కొత్త రూల్! రాజ్యాంగం అనుమతిస్తుందా?
Mother Comments on Police: పోలీసుల వేధింపులే కారణమని.. ప్రస్తుతం తేజ మూర్తి హైదరాబాద్ ఇన్ఫోసిస్ (Infosys)లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరి ప్రేమ వివాహాన్ని (Love Marriage) ఒప్పుకుని వారిని ఇంటికి తీసుకెళ్లి వారిని చక్కగా చూసుకుంటున్నామని తేజ్ మూర్తి తల్లి రమాదేవి తెలిపింది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు రావటంతో.. తరచూ గొడవలు జరుగుతున్నాయని, తన కోడలు ప్రియాంక వరలక్ష్మి పండగకు ఇంటికి వెళ్లిందని, ఆ తర్వాత ఓ లాయర్ ద్వారా ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో తన కొడుకు తేజ్ మూర్తి పై ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ విషయమై వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పోలీసులు భార్యాభర్తలకు ఎటువంటి కౌన్సిలింగ్ (Counseling) ఇవ్వకుండా పది లక్షల రూపాయలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని,.. లేకపోతే అటెంప్ట్ మర్డర్ కేసు పెడతానని వేధింపులకు గురి చేశారని తల్లి రమాదేవి ఆరోపించింది.వన్ టౌన్ పోలీసుల వేధింపులు తట్టుకోలేకేతన కొడుకు ఈ రోజు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. తన కొడుకు మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని రమాదేవి డిమాండ్ చేశారు.