ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గృహసారథుల, కన్వీనర్‌ల నియామకం దురదృష్టకరం : పంచాయతీరాజ్ ఛాంబర్ - andhra pradesh news

Panchayati Raj Chamber : ప్రభుత్వం గృహసారథుల, కన్వీనర్​ల నియామకాలు చేపట్టి సర్పంచ్​లకు హక్కులు లెేకుండా చేస్తోందని పంచాయతీరాజ్ ఛాంబర్ ఆరోపించింది. దీనివల్ల గ్రామాలలో అభివృద్ది పనులు చేయలేక పోతున్నామని అన్నారు. అంతేకాకుండా ఏ పని నిర్వహించుకోలేకున్నామని వివరించారు.

Panchayati Raj Chamber
పంచాయతీరాజ్ ఛాంబర్

By

Published : Feb 15, 2023, 2:16 PM IST

Sarpanchula Samara Shankharavam : వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీకి చెందిన వ్యక్తులను గృహసారథుల, కన్వీనర్‌లను నియమించి, సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహలుగా మార్చేశారని.. పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. ఏలూరులోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన.. సర్పంచుల సమర శంఖారావం కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు. ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన దారి మళ్లించిందని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీలో నిధులు లేకపోవడంతో ఏ పనులు చేయలేక పోతున్నామని అన్నారు. తమ హక్కులు, రావాల్సిన నిధుల కోసం పార్టీలకు అతీతంగా ఉద్యమిస్తామని సర్పంచులు హెచ్చరించారు.

గృహసారథుల, కన్వీనర్‌ల నియామకం దురదృష్టకరం : పంచాయతీరాజ్ ఛాంబర్

"ప్రైవేటు వ్యక్తుల్ని ఒక పార్టీకి చెందిన వ్యక్తుల్ని గృహసారథులుగా వాలంటీర్లపైన, కన్వీనర్లుగా గ్రామ సచివాలయ కార్యదర్శులపైన పెట్టటంమంతా దారుణం, నీచమైన, దౌర్భగ్యమైన పరిస్థితి సర్పంచులకు ఇంకోకటి ఉండదు. అందుకనే గృహసారథుల, కన్వీనర్‌ల ఏర్పాటును సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్​ ఛాంబర్​ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది." -రాజేంద్రప్రసాద్ , పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు

"ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. 95 శాతం సర్పంచులు రోడ్ల మీదకి వచ్చాము. బయటకు వచ్చిన సర్పంచులు ఇతర పార్టీలకు చెందిన వారని చాలా మంది అంటున్నారు. వాళ్లు అంటున్నట్లు ఇతర పార్టీల సర్పంచులము కాదు. మేము వైసీపీ సర్పంచులమే. సర్పంచులకు జగన్​మోహన్​ రెడ్డి అన్యాయం చేస్తే.. వైసీపీ జెండా పట్టుకునే రోడ్డేక్కుతాం." -పగడాల రమేష్, వైసీపీ సర్పంచ్‌

"మా తాత సర్పంచిగా పనిచేశారు. ఇప్పుడు నేను సర్పంచిగా పని చేస్తున్నాను. అప్పటికీ ఇప్పటికి చూసుకుంటే.. గృహసారథులను, కన్వీనర్‌లను నియమించి సర్పంచులకు అధికారం లేకుంటా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది వైఎస్సార్​సీపీ పార్టీ ప్రభుత్వమే." -ఎస్‌. బుచ్చిరాజు, జనసేన సర్పంచ్‌

గృహసారథుల, కన్వీనర్‌ల నియామకం :వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి 50 కుటుంబాలకు సారథ్యం వహిస్తూ ఇద్దరు గృహ సారథులను నియామించాలని భావించింది. అంతేకాకుండా ప్రతి సచివాలయానికి ముగ్గురు చొప్పున పార్టీ కన్వీనర్లను కూడా నియామించాలని అనుకుంది. అందుకు అనుగుణంగా సారథులను, కన్వీనర్​లను నియమించింది. నియమితులైన వారికి శిక్షణ ఇవ్వాలని.. ఖాళీలు ఉన్న నియోజకవర్గాల్లో నియామకాలు చెపట్టాలని ముఖ్యమంత్రి ఇటివలే ఓ సమావేశంలో నిర్ణయించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details