Negligence of Projects in YCP Government :వరదలకు డ్యాంలు కొట్టుకుపోయినప్పుడో నీటి తాకిడికి ప్రాజెక్ట్ గేటులు తెగిపోయినప్పుడో హడావుడిగా సమీక్షలు చేయడం ఆ తర్వాత దాన్ని మర్చిపోవడం వైసీపీ ప్రభుత్వానికి రివాజుగా మారింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల భద్రత, నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఖాళీలు భర్తీ చేయాలంటూ సరిగ్గా రెండేళ్ల క్రితం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన సందర్భంగా సీఎం అన్నారు.
ఆంధ్రావని జీవనాడిపై జగన్ అలసత్వం - రివర్స్‌గేర్‌లో పోలవరం పనులుఒక గేటు కొట్టుకుపోయినా బుద్దిరాలేదు - ఇప్పుడు మరో గేటు తెగిపడింది !
కానీ నేటికీ అవేమీ అమలు కాలేదు. కొత్త ప్రాజెక్ట్‌ల సంగతి దేవుడెరుగు ఉన్నవాటికి మరమ్మతులు చేపట్టకపోవడంతో కొట్టుకుపోతున్నాయి. శుక్రవారం రాత్రి ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టులో మరో గేటు కొట్టుకుపోయింది. ఇక పోలవరం సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాగునీటి ప్రాజెక్ట్‌ల్లో జగన్ హయాంలో జరిగినంత నిర్లక్ష్యం, విధ్వంసం బహుశా ఇంక ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదని జలవనరులశాఖ అధికారులే చెప్పుకుంటున్నారు.
Problems of Gundlakamma Project :గుండ్లకమ్మ ప్రాజెక్టులో తలుపులు తుప్పుపట్టాయని, మార్చుకోవాలని నివేదికలు పంపినా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. మరమ్మతులకు రూ. 3 కోట్లు ఇవ్వకపోవడంతో 2022 ఆగస్టు 31న రాత్రి గుండ్లకమ్మలో గేటు కొట్టుకుపోయింది. ఏడాది గడిచిపోయినా నిధులు ఇవ్వకపోవడంతో రెండో నంబరు గేటు శుక్రవారం కొట్టుకుపోయింది. అన్నమయ్య, పింఛా ప్రాజెక్టుల్లో మట్టి డ్యాంలు కొట్టుకుపోయాక సీఎం జగన్ సమీక్షించి ఇచ్చిన హామీలు గాలికి కొట్టుకుపోయాయి.
'నమ్మించు వంచించు'- సొంత జిల్లా ప్రజలను మోసం చేయడానికి సీఎం జగన్ కొత్త పథకం.
Present Status of Pulichintala Project : 2021 ఆగస్టు 5 తెల్లవారుజామున పులిచింతల ప్రాజెక్టులో 16వ నంబరు గేటు 750 మీటర్ల దూరం కొట్టుకుపోయింది. టై ప్లాట్స్ పూర్తిగా తెగిపోయాయి. రెండేళ్లుగా గేట్ల నిర్వహణ, ఇతర సాధారణ అంశాలనూ పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు తేల్చారు. 2020లో తెలంగాణలో భారీ వర్షాలు కురవగా దిగువన ఎలాంటి సన్నద్ధత చర్యలు చేపట్టకపోవడం వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 51 గ్రామాలు ముంపులో చిక్కి వేల హెక్టార్లలో పంట దెబ్బతింది.