Meeting on Polavaram Project Construction Works Issues in Delhi :పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశాలపై కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, జలశక్తి శాఖ మంత్రి సలహాదారు వెదిరే శ్రీరామ్ దిల్లీలో సమావేశం నిర్వహించారు. ఏపీ నుంచి జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు హాజరయ్యారు. సమావేశమంతా చాలా సీరియస్‌గా జరిగింది. అనేక అంశాల్లో రాష్ట్ర అధికారుల తీరుపై దేబశ్రీ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తిచేయాలన్నది ప్రస్తుత ప్రణాళిక అని అడిగారు. 2024 జూన్ నాటికి పూర్తి చేయాలని తమ ఉద్దేశమని ఏపీ అధికారులు చెప్పారు. ఇది ఆచరణాత్మక ప్రణాళికేనా అని ఆమె సీరియస్ అయ్యారు. ఎన్నో అంశాలు పరిష్కారం కావలసి ఉండగా అప్పటికి ప్రాజెక్టు పూర్తి చేయగలమని ఎలా అనుకుంటున్నారని ప్రశ్నించారు.
Central Government Serious On AP Government About Polavaram Project :పోలవరంలో అంశాలపై ఏపీ అధికారులకు ఎన్నిసార్లు లేఖ రాసినా స్పందన లేదని, కేంద్ర జలశక్తి తమను బాధ్యులను చేస్తోందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ శివానందన్ కుమార్ సమావేశంలో తెలిపారు. ప్రాజెక్టులో నీళ్లు ఖాళీచేయాలని తాము ఎన్నిసార్లు లేఖ రాసినా పట్టించుకోలేదని ఆయన చెప్పడంతో కేంద్ర కార్యదర్శి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎగువ కాఫర్‌డ్యాం తీవ్ర సీపేజీ సమస్యతో కొట్టుకుపోయేలా ఉందని, నీళ్లు నింపడం ఎంత ప్రమాదమో తెలుసా? అని దేబశ్రీ ప్రశ్నించారు. కాఫర్‌డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులని ఆమె నిలదీశారు. ఎగువ కాఫర్‌డ్యాం మరమ్మతులకు, నీటిని ఎత్తిపోస్తున్న ఖర్చుల్ని కేంద్రం చెల్లించబోదని తేల్చిచెప్పారు.
'పోలవరం' ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం - రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు: అంబటి రాంబాబు
Polavaram Project Issues :ప్రైమ్ ఆఫ్ వీర సాఫ్ట్‌వేర్ వినియోగించాలని రెండేళ్లుగా చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్ర కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సాఫ్ట్‌వేర్ అప్‌లోడ్ చేశామని, తేదీలు మాత్రమే అనుసంధానం చేయలేదని రాష్ట్ర అధికారులు చెప్పారు. తేదీలతో అనుసంధానం చేయకపోతే ఆ సాఫ్ట్‌వేర్ వల్ల ప్రయోజనం ఏంటని కేంద్ర అధికారి నిలదీశారు. దీనికి అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. మరో 15 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎగువ కాఫర్ డ్యాంసీపేజీ సమస్యపై అధ్యయనానికి తాము వెళ్లినప్పుడు అక్కడ అధికారులు గేలి చేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని CSMRS డైరెక్టర్ కేంద్ర కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. దీనిపై దేబశ్రీ మరింత ఆగ్రహానికి గురయ్యారు.