ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేటకెళ్లి.. బండరాళ్లలో తలకిందులుగా చిక్కుకొని.. - Man trapped in cave Telangana

MAN STUCKED IN CAVE : అడవిలో వేటకు వెళ్లి రాళ్ల మధ్య గుహలో చిక్కుకున్నాడు ఓ వ్యక్తి. అతన్ని కాపాడేందుకు అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. నిన్న సాయంత్రం నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటన తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

MAN STUCKED IN CAVE
MAN STUCKED IN CAVE

By

Published : Dec 15, 2022, 12:06 PM IST

MAN STUCKED IN CAVE : కొండల్లో వేటకు వెళ్లిన ఓ వ్యక్తి బండ రాళ్ల మధ్య తలకిందులుగా ఇరుక్కుపోయి మంగళవారం సాయంత్రం నుంచి నరకయాతన అనుభవిస్తున్నాడు. తెలంగాణలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన షాడ రాజు మంగళవారం సాయంత్రం అతని మిత్రుడు మహేశ్‌తో కలిసి ఘన్‌పూర్‌ శివారు అడవిలో వేటకు వెళ్లాడు. రాళ్లపై నుంచి వెళ్తుండగా సెల్‌ఫోన్‌ పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తూ తలకిందులుగా రాళ్ల మధ్యలోకి జారి ఇరుక్కుపోయాడు.

వెంట వచ్చిన మిత్రుడు బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాళ్లు, ఒక చేయి మాత్రమే బయటకు కనిపిస్తున్నాయి. వేటకు వెళ్లిన కారణంగా అధికారులకు సమాచారం ఇవ్వకుండా కుటుంబసభ్యులు, మిత్రులు బుధవారం మధ్యాహ్నం వరకు బయటకు తీసేందుకు శ్రమించారు. వీలుకాదని తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. రాజును బయటకు తీసేందుకు ఏఎస్పీ అన్యోన్య ఆధ్వర్యంలో యంత్రాలతో బుధవారం రాత్రి నుంచి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ధైర్యం చెబుతూ.. నీళ్లు, ఓఆర్‌ఎస్‌ తాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

వేటకెళ్లి.. బండరాళ్లలో తలకిందులుగా చిక్కుకొని..

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details