లాటరీ వేయకుండా వైకాపా నాయకులు... తమకు నచ్చిన వారికి స్థానికంగా ఇళ్ల స్థలాలు కేటాయించారని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెం వాసులు ఆందోళన చేపట్టారు. దళితులకు పక్క గ్రామంలో ఇళ్ల స్థలాలు కేటాయించారని గొల్లగూడెం గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులు వాపోయారు. స్థానికంగా కేటాయించిన ఇళ్ల స్థలాల వద్ద ఫోటోలు తీసి.. వేరే చోట స్థలాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించారని ఆరోపించారు.
"వైకాపా నాయకులకు నచ్చిన వారికే.. ఇళ్ల స్థలాలు కేటాయించారు"
లాటరీ వేయకుండా వైకాపా నాయకులు తమకు నచ్చిన వారికి... ఇళ్ల స్థలాలు కేటాయించారంటూ ఏలూరు జిల్లా గొల్లగూడెం వాసులు ఆందోళనకు దిగారు. తమ గ్రామంలోని స్థలాలు అనర్హులకు ఇచ్చి.. పక్కనున్న కంసాలిగుంట గ్రామంలో కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాలు తమకు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
concern
పక్క గ్రామం కంసాలిగుంటలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు కోర్టు వివాదాల్లో ఉండటంతో ఏమీ చేయలేకపోతున్నామంటూ లబ్ధిదారులు వాపోయారు. తమ గ్రామంలోనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆర్ఐ రమేష్, సీనియర్ అసిస్టెంట్ ఫణి లబ్ధిదారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.