ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Farmers Protest: 'చేతిలో చిల్లిగవ్వ లేదు.. పంటసాగు చేసేదెలా?'

Protest for grain purchase money: ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో అన్నదాతలు ధర్నా చేపట్టారు. ధాన్యం కొనుగోలు సొమ్మును తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కనీసం నారు మడులు పోసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Farmers Protest at Eluru
Farmers Protest at Eluru

By

Published : Jun 23, 2022, 4:41 PM IST

Updated : Jun 23, 2022, 5:41 PM IST

'చేతిలో చిల్లిగవ్వ లేదు.. పంటసాగు చేసేదెలా?'

Farmers Protest at Eluru collectorate: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన సొమ్మును తక్షణ చెల్లించాలంటూ... ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో అన్నదాతలు ధర్నా చేపట్టారు. వెంటనే కొనుగోళ్ల డబ్బులు చెల్లించాలని కోరుతూ.. జోలె పట్టి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం విక్రయించి నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ తమ ఖాతాలో సొమ్ము జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామన్నారు. కనీసం నారు మడులు పోసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదని వాపోయారు. తమకు చెల్లించాల్సిన డబ్బులను తక్షణమే విడుదల చేయాలని రైతులు డిమాండ్​ చేశారు.

Last Updated : Jun 23, 2022, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details