ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వైకాపా ప్రభుత్వం రైతుల్ని కులాల పేరుతో విభజిస్తుంది'

By

Published : Oct 14, 2019, 9:42 PM IST

రైతులను ప్రభుత్వం కులాల పేరుతో విభజిస్తుందని తెదేపా నేత జ్యోతులనెహ్రూ ఆరోపించారు. రైతు భరోసా పథకాన్ని రైతులందరికీ అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మారుస్తోందని మండిపడ్డారు.

తెదేపా నేత జ్యోతులనెహ్రూ

తెదేపా నేత జ్యోతులనెహ్రూ

రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైకాపా ప్రభుత్వం... రైతుల్ని కులాల పేరుతో విభజించటం ఎంతవరకు సమంజసమని తెదేపా నేత జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. రైతు భరోసా పథకం ద్వారా 12 వేల 500 ప్రతి రైతుకు అందిస్తామని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రైతు భరోసా పథకం కింద కేంద్రం ఇచ్చే 6 వేలు కాకుండా..రాష్ట్ర ప్రభుత్వం 12 వేల 500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగ్గంపేట నియోజవర్గంలో రోడ్డు విస్తరణకు నిధులు సమీకరించుకొని అభివృద్ధి పనులు చేపట్టటంలేదని ఆరోపించారు. చిరు వ్యాపారులను దృష్టిలో పెట్టుకొని రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details