ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాం ఎమ్మెల్యే అభ్యర్థి ఆచూకీ లభ్యం - పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు

కేంద్రపాలిత యానంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న పెమ్మాడి దుర్గాప్రసాద్ ఈ నెల 1వ తేదీ నుంచి కనపడటం లేదు. అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి ఆచూకీ కోసం 13 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం ఆయనను అపస్మారక స్థితిలో పోలీసులు గుర్తించారు.

Yanam MLA candidate
Yanam MLA candidate

By

Published : Apr 5, 2021, 8:13 AM IST

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో యానాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మాడి దుర్గాప్రసాద్‌ ఆచూకీ లభ్యమైంది. కాకినాడ అచ్చంపేట రోడ్డులో దుర్గాప్రసాద్‌ అపస్మారక స్థితిలో పడిఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈనెల 1న ఉదయం బయటకు వెళ్లిన తన భర్త దుర్గాప్రసాద్‌ ఇంటికి తిరిగి రాలేదని అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యానాం భాజపా అధ్యక్షుడిగా పనిచేసిన దుర్గాప్రసాద్‌ స్వంతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేయడంతో పార్టీ అధిష్ఠానం ఇటీవలే అతడిని సస్పెండ్‌ చేసింది.

ABOUT THE AUTHOR

...view details