యానాంలోని కంప్యూటర్ సెంటర్లో అగ్నిప్రమాదం - cc cameras
యానాంలోని ఓ కంప్యూటర్ సెంటర్లో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న సిబ్బంది మంటలు అదుపు చేశారు. సుమారు రూ. 50 లక్షల నష్టం వాటిల్లినట్టు అంచనా.
కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో ఉన్న కంప్యూటర్ సెంటర్లో విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. దుకాణం నుంచి పొగలు బయటకు రావడం గుర్తించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. కంప్యూటర్ విడిభాగాలు.... లాప్‌ట్యాప్ అమ్మకం, సర్వీసింగ్ చేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు వంటివి షాపు యజమానులు నిర్వహిస్తుంటారు. ఈరోజు సోమవారం సెలవు కావడంతో తాళం వేసి ఉండగా 12 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. షాపులో ఉన్న ఏసీ యంత్రంలో మొదట మంటలు చెలరేగాయి. రూ. 50 లక్షల మేర నష్టం కలిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. మంటలు పక్క దుకాణాలపై పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.