తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కరోనా కష్ట కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. ఎలాంటి సహకారం అందక నిరుపేదలు కూలి దొరకకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'పేదలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి'
సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కరోనా కష్ట కాలంలో ఇబ్బందులు పడుతున్న పేదవారిని ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
సీపీఐ, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన