200 మిల్లీ గ్రాములతో చిట్టి పొట్టి క్రికెట్ ప్రపంచ కప్ నమూనాను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ కళాకారుడు తయారు చేస్తే.. తానేం తక్కువ కాదంటూ.. సూదిలో పట్టే ప్రపంచకప్ తయారు చేశాడు.. కాకినాడకు చెందిన సూక్ష్మ కళాఖండాల కళాకారుడు రమేష్. సూది రంధ్రంలో ఇమిడేంత అతి సూక్ష్మ బంగారు ట్రోఫీని తయారు చేశాడు. కేవలం 20 మిల్లీ గ్రాముల బరువు దీని ప్రత్యేకత. మైక్రోస్కోప్ సహాయంతో మాత్రమే ఈ ప్రపంచ కప్ చూసే అవకాశం ఉంది. తయారీకి పది రోజులు పట్టిందని రమేష్ తెలిపారు. క్రికెట్ ఆంటే ఎంతో అభిమానం గల ఆయన.. ఈ ప్రపంచ కప్ లో భారత జట్టు విజయం సాధించాలని ఆకాక్షించారు.
చిట్టి సూదిలో... వరల్డ్ కప్ దూరిపోయింది!
క్రీడాభిమానులను ఎవర్ని పలకరించినా.. ఇప్పుడు క్రికెట్ ముచ్చట్లే. సెమీస్ లో చేరిన భారత్.. ఫైనల్స్ లో ప్రవేశించి కప్పు కొట్టాలని అంతా ఆకాంక్షించేవారే. ఇందులో కొందరు.. విభిన్నంగా క్రికెట్ పై ప్రేమను చాటుకుంటున్నారు. అందులో కాకినాడకు చెందిన రమేష్ ఒకరు.
సూదిలో వరల్డ్ కప్