దాడి చేసిన వారిని కాకుండా గాయపడిన వారిని అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ మహిళలు.. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. న్యాయం జరగక పోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని.. పెద్దాపురం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన నాగమణి అనే మహిళ తోటి మహిళలతో కలిసి స్టేషన్ వద్ద హల్ చల్ చేసింది. పోలీసుల ఆమె నుంచి పెట్రోల్ బాటిల్ స్వాధీనం చేసుకుని.. వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు.
పెట్రోల్ బాటిల్‌తో పోలీస్ స్టేషన్ ఎదుట మహిళల ఆందోళన
అన్యాయంగా తమ వారిని అరెస్టు చేశారని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పోలీస్ స్టేషన్ వద్ద మహిళలు ఆందోళన చేశారు. న్యాయం జరగకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామన్నారు. పోలీసులు... పెట్రోల్ బాటిల్‌ను స్వాధీనం చేసుకుని అక్కడినుంచి వారిని వెళ్లగొట్టారు.
మహిళల ఆందోళన
మూడు రోజులు కిందట తాటిపర్తిలో రహదారి విషయంలో రెండు కుటుంబాల మధ్య వివాదం జరుగగా.. పోలీసులు నాగమణి భర్త సత్తిబాబు, కుమారుడు రాంబాబుతోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు.
ఇదీ చదవండి:మహిళపై అత్యాచారయత్నం.. చెట్టుకు కట్టేసి ముగ్గురికి దేహశుద్ధి!