ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్త అన్యాయం చేశాడని చంటి బిడ్డతో మహిళ నిరసన - ప్రత్తిపాడు తాజా వార్తలు

తన భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు పంచాయతీ కార్యాలయం ఎదుట ఓ మహిళ చిన్నారితో పాటు నిరసనకు దిగింది. తనను ప్రేమించి వివాహం చేసుకున్న భర్త... ఇప్పుడు మరో మహిళను పెళ్లాడాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

women protest for husband
women protest for husband

By

Published : Dec 2, 2020, 8:59 PM IST

ప్రేమ వివాహం చేసుకొన్న తనను, బిడ్డను కాదని రెండో వివాహం చేసుకొన్న తన భర్తపై చర్యలు తీసుకోవాలంటూ తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు పంచాయతీ కార్యాలయం ఎదుట ఓ మహిళ చిన్నారితో పాటు నిరసనకు దిగింది. ప్రత్తిపాడులో కొత్తపేట కాలనీకి చెందిన అరుణ... ఇదే గ్రామానికే చెందిన నాగేశ్వరావు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. ఆమె గర్భవతి కావటంతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న పెద్దల సమక్షంలో వారిద్దరికీ వివాహం జరిపించారు. బిడ్డ పుట్టిన తరువాత అరుణ తన భర్తతోపాటు ప్రత్తిపాడులోనే జీవనం కొనసాగించింది.

అయితే నవంబర్ 25న తన భర్తకు మేడపాడుకు చెందిన మరో మహిళతో తన అత్తమామ వివాహం జరిపించారని అరుణ ఆరోపిస్తోంది. తన భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని ఆమె వెల్లడించింది. తనకు, తన బిడ్డకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తానని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details