ఈనాడు పెళ్లిపందిరి, రజక సేవాసంఘం వారు సంయుక్తంగా రాజమహేంద్రవరంలో రజక వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. రజక సేవాసంఘం కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉభయగోదావరి జిల్లాల నుంచే కాకుండా చుట్టు పక్కల జిల్లాల నుంచి వధూవరులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. వారి అభిప్రాయాలను పంచుకున్నారు. వధూవరుల వివరాలను తెరలపై ప్రదర్శించారు. వివాహ వేదికలు నిర్వహించడంలో ఈనాడుకు సాటి లేదని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని కోరారు.
ఈనాడు పెళ్లి పందిరి ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక - wedding
తూర్పు గోదావరి జిల్లా రామజమహేంద్రవరంలో ఈనాడు పెళ్లిపందిరి, రజక సేవా సంఘం వారు సంయుక్తంగా రజక వివాహ పరిచయ వేదిక నిర్వహించారు.
వివాహ పరిచయ వేదిక