రానున్న ఏడాదిలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మీ తెలిపారు. ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నేర వార్షిక నివేదికలను వెల్లడించారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది క్రైంరేటు బాగా తగ్గించగలిగామన్నారు. దిశ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయడానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేశామన్నారు. డయల్ 100 నెంబరుకు ఆపదలో ఉన్నవారు సమాచారం అందిస్తే... 5 నిమిషాల వ్యవధిలోనే స్పందించనున్నట్లు తెలిపారు.
'మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తాం'
తూర్పుగోదావరి జిల్లా నేర వార్షిక నివేదికలను ఎస్పీ నయీం అస్మీ వెల్లడించారు. వచ్చే ఏడాదిలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎస్పీ తెలిపారు.
'మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తాం'