ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాసిరకం ఇసుక.... ఇంటి స్లాబు ఎలా వేసేది!

ఇంటి నిర్మాణం కోసం ఆన్​లైన్​ బుక్​ చేయగా మట్టితో కూడిన నాసిరకం ఇసుకను పంపించిన ఘటన కొత్తపేటలో చోటు చేసుకుంది. తాను కట్టిన 16 వేల రూపాయలు బూడిద పాలు చేశారని షేక్​ గౌస్​ వాపోయారు. ఇంటి స్లాబు నిర్మాణం కోసం నగదును చెల్లించానని... ఇప్పడు వచ్చిన మట్టి ఎందుకు పని రాకుండా పోయిందని తెలిపారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

waste sand came in kothapeta after booking 5 units lorry load in east godavari district
ఈ మట్టితో నేనేమి చేసేది

By

Published : Jun 15, 2020, 11:26 AM IST

ఇంటి నిర్మాణం కోసం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో చెందిన షేక్​ గౌస్​ పది రోజుల కిందట 5 యూనిట్ల లారీ ఇసుక కోసం 16 వేల రూపాయలు ఆన్​లైన్​లో చెల్లించాడు. కానీ... శనివారం రాత్రి ఇసుక దిగుమతి చేయగానే నాసిరకం ఇసుక వచ్చిందని ఆయన వాపోయారు. ఈ విషయంపై లారీ డ్రైవర్​ను ప్రశ్నించగా తమకు సంబంధం లేదంటూ చెప్పాడని తెలిపారు. ర్యాంపుల్లో ఎగుమతి చేసిన ఇసుక మాత్రమే తాను తీసుకువచ్చానంటూ సమాధానం ఇచ్చాడని చెప్పారు. భవనం స్లాబు నిమిత్తం ఇసుకను బుక్​ చేశానని... కానీ మట్టితో కూడిన నాసిరకం ఇసుక వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కట్టిన డబ్బును పూర్తిగా నష్టపోయానని... ఈ విషయంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గౌస్​ వేడుకున్నారు.

ఈ మట్టితో నేనేమి చేసేది

ABOUT THE AUTHOR

...view details