ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విడుదల కాని ఉత్తర్వులు.. జాప్యమవుతున్న కాలువ పనులు

తూర్పు గోదావరి జిల్లాలో కాలువల నిర్వహణ పనులకు సంబంధించిన ఉత్తర్వుల జారీలో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన నిర్మాణ, తదితర పనులు.. ముందుకు కదలడం లేదు.

canal
కాలువల నిర్వహణ

By

Published : May 20, 2021, 12:54 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో వేసవికాలంలో చేయాల్సిన కాలువల నిర్వహణ పనుల కోసం.. నెలరోజుల క్రితం జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అమరావతిలోని కమాండ్ ఏరియా డెవలప్​మెంట్​ అథారిటీ కమిటీ.. ఈనెల 10న ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు లిఖిత పూర్వక ఉత్తర్వులు జారీ కాలేదు. ఫలితంగా.. కాలువల నిర్వహణ పనులు జాప్యం అవుతున్నాయి.

ఏటా వేసవిలో కాలువల్లో నీటిని కట్టేసిన తర్వాత… కాలువలకు నిర్వహణ పనులు చేస్తారు. జూన్ 10 లోగా తిరిగి నీటిని విడుదల చేస్తారు. ఈ లోపు పనులన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది జిల్లాలో రూ.30.55కోట్లతో 290 నిర్వహణ పనులకు గాను ప్రతిపాదనలు పంపించారు. వాటికి ఆమోదం లభించినా ఉత్తర్వులు ఇంకా రాలేదని జలవనరుల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్ శ్రీరామకృష్ణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details