తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో వినాయక నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. వినాయక మండపాల్లో కొలువుదీరేందుకు వినాయక విగ్రహాలు సిద్ధమయ్యాయి. రావులపాలెంలోని కళాకారులు వినాయక ప్రతిమలను సిద్ధం చేశారు. ఇక్కడ చిన్న విగ్రహాల నుంచి 13 అడుగుల విగ్రహాల వరకు వివిధ రకాల రూపాలలో అందంగా తయారు చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడకు వచ్చి ఈ విగ్రహాలను కొనుగోలు చేస్తుంటారు. కొందరైతే ఆర్డర్లు ఇచ్చి.. తమకు నచ్చిన ఆకృతిలో విగ్రహం తయారు చేయించుకుంటారు.
గణపయ్య వస్తున్నాడోచ్....!
విఘ్నాలను తొలగించే లంబోదరుడు వాడవాడలా కొలువు ధీరే సమయం ఆసన్నమైంది. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఏ వీధి చూసినా.. ఏ ప్రాంతం చూసినా.. వినాయక మండపాలు దర్శనమిస్తాయి.వివిధ రూపాలలో గణనాథులు దర్శనమివ్వనున్నాయి.
vinayaka idols at ravulapalem in east godavri district