తూర్పుగోదావరి జిల్లా ఎర్రంశెట్టివారిపాలెంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులకు... పలువురు వైకాపా నాయకులు బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలు అందించారు. తెదేపా నాయకుడు మందపాటి కిరణ్ కుమార్... బాధితులకు బియ్యం, దుస్తులు పంపిణీ చేశారు. జనసేన నాయకుడు ఆదిమూలం వెంకటేశ్వరరావు రూ.20,000 ఆర్థిక సాయం అందించారు. అంబాజీపేటలోని శ్రీనివాస ఎంటర్ప్రైజెస్, భారత్ గ్యాస్ ఏజెన్సీ... మూడు కుటుంబాలకు రూ.14,500 విలువచేసే వంట గ్యాస్ సిలిండర్లు, స్టవ్లు అందించారు.
అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం - fire accident news in erramshettivaripalem
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని ఎర్రంశెట్టివారిపాలెంలో అగ్నిప్రమాద బాధితులకు... ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు హామీఇచ్చారు. పలువురు రాజకీయ నాయకులు వారికి బియ్యం, నిత్యావసర సరకులు అందజేశారు.
అగ్నిమాపక బాధితులను ఆదుకుంటామన్న ఎమ్మెల్యే చిట్టిబాబు