సహయక చర్యలపై ముంపు బాధితుల అసంతృప్తి గోదావరి ఉద్ధృతిలో భాగంగా... తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. సరైన సౌకర్యాలు లేక బాధితులు ఆందోళన చెందారు. ఇళ్లు కొల్పోయిన వారందరికీ కొత్త ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. వరదలు వచ్చినప్పుడు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ
పునరావాస కేంద్రాలకు తరలిపోతున్న బాధితులు గోదావరి వరదతో దేవీపట్నం వాసుల పరిస్థితి మళ్లీ దయనీయంగా మారింది. ఇప్పటికే 36 గ్రామాలను వరదనీరు చుట్టుముట్టేసింది. రహదారులు నీటమునిగాయి. పూడిపల్లి నీటమునిగింది. తొయ్యేరు, దండంగి, వీరవరం, డి.రావిలంక, దేవీపట్నం గ్రామాల్లోకి నీరు చేరుతోంది. రంపచోడవరం ITDA అధికారులు, RDOశ్రీనివాసరావు, ASP విశాల్ జిందాల్ తదితరులు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. పునరావాస ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చూడండి:
గోదావరి మళ్లీ ఉగ్రరూపం... లంక వాసుల్లో అలజడి