వరి చేల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తూ.. రహదారులపై వేగంగా వెళుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వచ్చిన ఫిర్యాదులపై అమలాపురం డీఎస్పీ రమణ స్పందించారు. వారి ఆదేశాల మేరకు సీఐ పెద్దిరాజు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి వాహనాలను పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న 7 ట్రాక్టర్లు, లారీని సీజ్ చేశారు. ట్రాక్టర్‌లను మైనర్లు నడుపుతున్నట్టు గుర్తించామని.. వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశామని సీఐ పెద్దిరాజు తెలిపారు.
అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాల పట్టివేత - tractors
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. ఏడు ట్రాక్టర్లు, ఒక లారీని సీజ్ చేశారు.
వాహనాలు సీజ్